Vegetable Farming: రెండెకరాల్లో కూరగాయల సాగు.. రెండు నెలల్లోనే రూ.1.5 లక్షల లాభం!

Vegetable Farming Success Story: కూరగాయల సాగుతో తక్కువ కాలంలోనే మంచి లాభాలు పొందవచ్చని నిరూపిస్తున్నారు కొందరు రైతులు.

Arun Chilukuri
Published on: 17 Nov 2026 5:14 PM IST
Vegetable Farming
X

Vegetable Farming: రెండెకరాల్లో కూరగాయల సాగు.. రెండు నెలల్లోనే రూ.1.5 లక్షల లాభం!

Vegetable Farming Success Story: సాంప్రదాయ పంటలకు భిన్నంగా కాస్త ఆలోచించి, సరైన పద్ధతిలో సాగు చేస్తే వ్యవసాయంలో అద్భుతమైన లాభాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు కొందరు రైతులు. బయట ఉద్యోగాలు వెతుక్కోకుండా, తమ సొంత పొలంలోనే కూరగాయల సాగు చేపట్టి అద్భుతమైన లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ కోవకే చెందిన ఓ మహిళా రైతు తన అనుభవాలను, కూరగాయల సాగు ద్వారా సాధించిన విజయాన్ని పంచుకున్నారు.

తొలుత వేసిన పంటలో నష్టం రావడంతో ఏం చేయాలనే ఆలోచనలో పడిన సదరు రైతు, సోషల్ మీడియాలో కూరగాయల సాగు విధానాలను పరిశీలించారు. చిన్న పిల్లలను చూసుకుంటూ బయట ఉద్యోగం చేయడం కష్టమవడంతో, తమ సొంత పొలంలోనే కూరగాయల సాగు చేయాలని నిర్ణయించుకున్నారు.

తన పొలంలో ప్రధానంగా నాలుగు రకాల కూరగాయలను సాగు చేసినట్లు ఆమె తెలిపారు. బీరకాయ, సొరకాయ, కాకరకాయ, బెండకాయ.

నవంబర్ నెలలో వేసిన ఈ పంట ద్వారా కేవలం రెండు నెలల్లోనే, అనగా డిసెంబర్ నాటికి రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో మార్కెట్‌లో కూరగాయలకు మంచి ధర (కిలో రూ.50 నుంచి రూ.60 వరకు) ఉండటంతో లాభాలు మరింత మెరుగ్గా వచ్చాయి. ఈ సాగుకు మొత్తం రూ.50,000 పెట్టుబడి పోగా, రూ.1.5 లక్షల వరకు నికర లాభం మిగిలిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. బయట ఉద్యోగం చేయడం కంటే సొంత పొలంలో ఈ సాగు ఎంతో లాభదాయకంగా ఉందని ఆమె తెలిపారు.

వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్న యువ రైతులు కూరగాయల సాగుపై ప్రత్యేక దృష్టి సంచారిస్తున్నారు. అయితే, తక్కువ అనుభవంతో సాధారణ పద్ధతుల్లో సాగు చేస్తున్న వీరికి, ఉద్యానవన శాఖ ద్వారా పందిళ్ల ఏర్పాటుకు సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి.

రైతులు తమ సమీపంలోని ఉద్యాన శాఖ అధికారులను లేదా జిల్లా ఉద్యాన సర్దిడి అధికారులను సంప్రదించి ఈ సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పందిళ్ల సాగును అలవాటు చేసుకుంటే సాధారణ దిగుబడి కంటే రెండు నుంచి మూడు రెట్లు అధికంగా దిగుబడి సాధించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.