Boduppal: ఉప్పల్ డిపో వద్ద సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ శ్రేణులు!

Boduppal: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బోడుప్పల్ ఉప్పల్ డిపో వద్ద బీజేపీ శ్రేణులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపాయి.

KARUNAKAR, UPPAL
Published on: 30 Sept 2026 12:43 PM IST
Boduppal
X

Boduppal: ఉప్పల్ డిపో వద్ద సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ శ్రేణులు!

Boduppal: ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని ఉప్పల్‌ డిపో ప్రాంతంలో బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ‘హర హర మహాదేవ.. శంభో శంకర’ అంటూ నినాదాలు చేస్తూ సీఎం వ్యాఖ్యలను ఖండించారు.

ఈ బీజేపీ నాయకులు సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు దేశంలోని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ అసలు స్వరూపాన్ని రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా మరోసారి బయటపెట్టారని విమర్శించారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజలను విభజించే రాజకీయాలకు కాంగ్రెస్‌ పాల్పడుతోందని ఆరోపించారు.

ఉత్తర, దక్షిణ భారతదేశం పేరుతో ప్రజల మధ్య విభజన తీసుకురావాలనే ఆలోచన కాంగ్రెస్‌కు ఉందని బీజేపీ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్‌ చేస్తున్న కుట్రలను దేశ ప్రజలు గమనిస్తున్నారని, హిందూ సమాజాన్ని విభజించే ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ప్రజలంతా ఏకమవుతున్నారని అన్నారు. గాంధీ పేరును ఉపయోగించుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు.. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు గాంధీ వారసత్వం ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టం చేయాలని ప్రశ్నించారు.

ఇటీవల కేరళలో చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాశీ విశ్వనాథ ఆలయాన్ని కాంగ్రెస్‌ పాలనలో తగినంతగా అభివృద్ధి చేయలేదని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాశీ విశ్వనాథ ఆలయ అభివృద్ధితో పాటు కాశీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చిందని నాయకులు పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వం బీజేపీదేనని అన్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్‌ తన ప్రాబల్యాన్ని కోల్పోయిందని, రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలోనూ కాంగ్రెస్‌కు ప్రజల నుంచి ఆదరణ తగ్గుతుందని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. హిందువుల మనోభావాలను గౌరవించాలని, మతపరమైన అంశాలపై బాధ్యతాయుతంగా మాట్లాడాలని కాంగ్రెస్‌ నాయకులకు సూచించారు.

హిందూ సమాజాన్ని విభజించే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించిన బీజేపీ శ్రేణులు, ఖబడ్దార్‌” అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్, కామారెడ్డి ఇన్‌చార్జి, మాజీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రమ్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోనె శ్రీనివాస్‌, రాష్ట్ర యువమోర్చా మాజీ ప్రధాన కార్యదర్శి సామల పవన్‌రెడ్డి, జిల్లా యువమోర్చా అధ్యక్షుడు రాగం అర్జున్‌, రాష్ట్ర యువమోర్చా మాజీ ఉపాధ్యక్షుడు చిత్రాంజన్‌రెడ్డి, మాజీ డివిజన్‌ అధ్యక్షుడు నెమలికొండ అనిల్‌రెడ్డి, బీసీ మోర్చా రాష్ట్ర నాయకురాలు సుజాత నాయుడు, ఘట్‌కేసర్‌ అధ్యక్షుడు బస్వరాజ్‌గౌడ్‌, పోచారం అధ్యక్షుడు సురేష్‌నాయక్‌, జిల్లా సోషల్‌ మీడియా ప్రతినిధులు ప్రవీణ్‌కుమార్‌, సంకీర్తన్‌, సంతోష్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL