Maheshwaram: మహేశ్వరంలో అంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు జన్మ!

Maheshwaram: మహేశ్వరం మండలం కేసీ తండాకు చెందిన గర్భిణికి 108 అంబులెన్స్‌లోనే సురక్షిత ప్రసవం జరిపిన సిబ్బంది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రీతు, తల్లీబిడ్డ క్షేమం.

K Sai, Maheswaram
Published on: 28 Aug 2026 10:21 AM IST
Maheshwaram
X

Maheshwaram: మహేశ్వరంలో అంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు జన్మ!

Maheshwaram: మహేశ్వరం మండలం కేసీ తండాకు చెందిన రాహుల్, రీతు దంపతులకు 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో సాయం అందించడంతో ప్రసవం సురక్షితంగా జరిగింది. రీతుకు ఇది మొదటి కాన్పు.

పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను మహేశ్వరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని పేట్లబుర్జు ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రికి రిఫర్ చేశారు.

దీంతో 108 అంబులెన్స్‌లో ఆమెను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఈ ఎం టీ సురేందర్ పైలట్ యాదయ్య అంబులెన్స్‌ను పక్కకు నిలిపి, అంబులెన్స్‌లోనే సాధారణ ప్రసవం చేశారు.రీతు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షిత ప్రసవం చేసిన 108 సిబ్బందిని బంధువులు అభినందించారు.

అనంతరం తల్లీబిడ్డలను పేట్లబుర్జు ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

K Sai, Maheswaram

K Sai, Maheswaram

Next Story