Vikarabad: కుల్కచర్ల హాస్టల్‌లో పురుగుల మందు తాగిన పదవ తరగతి విద్యార్థి!
Vikarabad: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల గిరిజన గురుకుల హాస్టల్‌లో పదవ తరగతి విద్యార్థి తారక్ తేజ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Vikarabad: కుల్కచర్ల హాస్టల్‌లో పురుగుల మందు తాగిన పదవ తరగతి విద్యార్థి!
Vikarabad: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని గిరిజన గురుకుల వసతి గృహంలో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తారక్ తేజ అనే విద్యార్థి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే అతడిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ.. ఈ ఘటనపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లుగా అదే హాస్టల్లో చదువుకుంటున్న తమ కుమారుడు ఒక్కసారిగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం వెనుక తోటి విద్యార్థుల వేధింపులు, హాస్టల్ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు.
ఉదయం పిల్లాడు కనిపించడం లేదని సిబ్బంది చెప్పారని, తాము పిఎస్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్తుంటే హాస్టల్లోనే ఉన్నాడంటూ ఫోన్ చేశారని విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది అనుమానాస్పద వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




