Nagole: చిన్న వయసు… పెద్ద మనసు..! పదకొండేళ్ల చిన్నారి త్యాగ గుణం..!
Nagole: క్యాన్సర్ బాధితుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు హైదరాబాద్ నాగోల్‌కు చెందిన 11 ఏళ్ల ఆరో తరగతి చిన్నారి తన పొడవాటి జుట్టును స్వచ్ఛందంగా దానం చేసింది.
Nagole: చిన్న వయసు… పెద్ద మనసు..! పదకొండేళ్ల చిన్నారి త్యాగ గుణం..!
Hyderabad: క్యాన్సర్‌తో పోరాడుతూ కీమోథెరపీ కారణంగా జుట్టు కోల్పోయిన చిన్నారులు, మహిళలకు ఆత్మవిశ్వాసం నింపేందుకు ఓ పదకొండేళ్ల చిన్నారి తన అందమైన పొడవాటి జుట్టును దానం చేసి అందరి ప్రశంసలు అందుకుంది..! నాగోల్ ఆల్కపూరికి చెందిన ఆరో తరగతి విద్యార్థిని, తనకు ఎంతో ఇష్టమైన జుట్టును స్వచ్ఛంద సంస్థ ద్వారా క్యాన్సర్ బాధితుల కోసం అందించింది. “అందం అంటే కేవలం మన కోసం కాదు… ఇతరుల ముఖంలో చిరునవ్వు తీసుకురావడమూ అందమే” అని ఆ చిన్నారి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేశాయి..!
క్యాన్సర్ చికిత్స సమయంలో జుట్టు రాలిపోవడంతో అనేక మంది చిన్నారులు, మహిళలు మానసికంగా తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. అలాంటి వారికి విగ్గులు తయారు చేయడానికి ఈ జుట్టు ఉపయోగపడనుంది. బాధితులకు ఇది కేవలం హెయిర్ మాత్రమే కాదు… కోల్పోయిన ఆత్మవిశ్వాసం, ఆనందం, కొత్త ఆశకు ప్రతీకగా నిలవనుంది. చిన్న వయసులోనే సమాజం పట్ల బాధ్యత, మానవత్వం చాటిన ఈ చిన్నారి సేవా భావాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానికులు అభినందిస్తున్నారు. “మనుషులను అందంగా మార్చేది రూపం కాదు… మంచి మనసు” అని ఈ సంఘటన మరోసారి నిరూపించిందని పలువురు పేర్కొన్నారు..!




