Hyderabad: కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల్లో భారీ స్కామ్ బీజేపీ

Hyderabad: తెలంగాణలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలను నొక్కేస్తూ రూ.2 వేల కోట్ల స్కామ్‌కు పాల్పడ్డాయని బీజేపీ నేత కళ్యాణ్ నాయక్ ఆరోపణ.

G. Govind, Medchal
Published on: 11 July 2026 5:54 PM IST
Hyderabad
X

Hyderabad: కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల్లో భారీ స్కామ్ బీజేపీ

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయం బీజేపీ ఉపాధ్యక్షులు కళ్యాణ్ నాయక్ తెలంగాణలో 4800 కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నుండి నాలుగు నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదు.

కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలతో ఏజెన్సీలు ఆడుకుంటున్నాయి. ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్న ఏజెన్సీలు ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదు. ప్రభుత్వం 22 వేలు జీతం ఇస్తే.. ఏజెన్సీ ఒక్కో ఉద్యోగికి 13600 జీతం ఇస్తూ 9 వేల రూపాయలు వరకు నొక్కేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లపై పిర్యాదులు చేసిన సిఎం చర్యలు తీసుకోవడం లేదు.

కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల బినామీలు ఏజెన్సీలు ఉన్నాయి. రెండు వేల కోట్ల రూపాయల కుంభకోణాలకి ఏజెన్సీలు పాల్పడుతున్నాయి. రెండు లక్షల 21 వేల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీలని రద్దు చేయాలి. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంకులలోనే డైరెక్ట్ గా జీతాలు వెయ్యాలి.

G. Govind, Medchal

G. Govind, Medchal

Next Story