Kapra: కాప్రాలో 2K రన్ సందడి.. జనాభా లెక్కల సేకరణపై అధికారుల కీలక ప్రకటన!

Kapra: కాప్రాలో జనాభా లెక్కల సేకరణపై అవగాహన కల్పించేందుకు 2K రన్ నిర్వహించారు.

ASHOK, KAPRA
Published on: 9 May 2026 12:55 PM IST
Kapra
X

Kapra: కాప్రాలో 2K రన్ సందడి.. జనాభా లెక్కల సేకరణపై అధికారుల కీలక ప్రకటన!

Kapra: జనన గణన జనాభా లెక్కల సేకరణలో భాగంగా కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి , నాచారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నిత్యానంద్ ఆధ్వర్యంలో ప్రజలకు జనాభా లెక్కల సేకరణ విషయమై అవగాహన కల్పించడంలో భాగంగా 2 K రన్ / వాక్ నిర్వహించారు, కాప్రా సర్కిల్ కార్యాలయం నుండి ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ మీదుగా రాధిక రోడ్డు వరకు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో రెండు సర్కిలలోని వివిధ కాలనీల రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కాలేజీ విద్యార్థిని విద్యార్థులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కే సి సి సి ప్రెసిడెంట్ సంజీవరెడ్డి , ఈసీఐఎల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సెకండ్ ఫేస్ హౌసింగ్ మౌలాలి హౌసింగ్ బోర్డ్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటాచారి , కమలా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సాయి సుధీర్ డిగ్రీ కాలేజ్ NCC క్యాడేట్ విద్యార్థినీ విద్యార్థులు ప్రజలు పెద్ద NCC Ano. లెఫ్ట్నెంట్ బొప్పాని విజయ్ సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కే సి సి ప్రెసిడెంట్ సంజీవరెడ్డి , వెంకటాచారి మాట్లాడుతూ ప్రభుత్వం తలపెట్టిన జనన గణన సర్వేలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానము ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషం అని, జనాభా లెక్కల సేకరణ కు తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఈ యొక్క అవకాశాన్ని కాలనీ వారందరికీ తెలియజేసి వినియోగించుకుంటామని తెలియజేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్లు శ్రీహరి ,నిత్యానంద్ మాట్లాడుతూ ప్రజలంతా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఈనెల 10వ తేదీ వరకు చేసుకోవాలని, ఈనెల 11వ తేదీ నుండి జనాభా లెక్కల సేకరణ విషయమై ఇంటింటికి వచ్చే సిబ్బందికి సహకరించాలని జూన్ 9 వరకు జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాలరీ సూపర్వైజర్ సుదర్శన్ మున్సిపల్ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story