Quthbullapur: కబ్జాలకు చెక్.. ప్రభుత్వ కార్యాలయాలకు భారీగా భూమి
Quthbullapur: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోని ఎస్ఎఫ్సీ (SFC) స్థలాన్ని ప్రభుత్వం వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించింది.
Quthbullapur: కబ్జాలకు చెక్.. ప్రభుత్వ కార్యాలయాలకు భారీగా భూమి
Quthbullapur: గాజులరామారంలోని ఎస్ ఎఫ్ సి స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పలు ప్రభుత్వ కార్యాలయాలకు రెవెన్యూ అధికారులు, కేటాయించారు. సర్వే నంబర్ 307లో 317 ఎక రాలు ఉండగా, 308లో 19 ఎకరాలు ఉంది. మొత్తం 336 ఎకరాల స్థలం గాజుల రామారం నుంచి ప్రగతినగర్ వరకు విస్తరించి ఉంది.
ఆ స్థలాన్ని 2007లో అప్పటి ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ) కి అప్పగించింది. కాగా చుట్టు పక్కల కొంతమేర స్థలం కబ్జా కోరల్లో చిక్కుకొని బస్తీలు ఏర్పడ్డాయి. మిగిలిన స్థలం కబ్జా బారిన పదకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం 7 శాఖ లకు గాను 10 కార్యాలయాలకు అవసరమయ్యే స్థలాన్ని కేటాయించింది. నెల రోజుల వ్యవధిలో హద్దులను సైతం ఏర్పాటు చేశారు.
కబ్జా కాకుండా రాళ్లు పాతారు
ఆర్టీసీకి 100 ఎకరాలు, పోలీస్ ఆర్మ్ రిజర్వుడ్కు 87.25 ఎకరాలు, పోలీస్ ట్రాన్స్ పోర్ట్ కి 60 ఎకరాలు, ఇంటిగ్రేటెడ్, రిజిస్ట్రేషన్ కార్యాలయానికి 10 ఎకరాలు, స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి 4 ఎకరాలు, ఎన్సీసీ అకాడమీకి 20 ఎకరాలు, వెటర్నరీ హాస్పిటల్కు 20 ఎకరాలు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు 20 ఎకరాలు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టలు 5 ఎకరాలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్కు ఎకరాలు ఇలా 331 ఎకరాలకు హద్దు రాళ్లను పాతారు.




