Uppal: బిల్డర్ నిర్లక్ష్యం.. నీటి సంపులో పడి ఐదేళ్ల బాలుడు మృతి!

Uppal: హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని మేడిపల్లి సత్యనారాయణపురంలో ఘోర ప్రమాదం జరిగింది.

KARUNAKAR, UPPAL
Published on: 16 May 2026 7:57 AM IST
Uppal
X

Uppal: బిల్డర్ నిర్లక్ష్యం.. నీటి సంపులో పడి ఐదేళ్ల బాలుడు మృతి!

ఉప్పల్: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి సత్యనారాయణపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద భద్రతా చర్యలు లేకపోవడంతో ఐదేళ్ల బాలుడు నీటితో నిండిన సంపులో పడి మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు జిల్లా కందుకూర్ మండలం రాల్లపాడు గ్రామానికి చెందిన జూపల్లి మహేందర్ కుటుంబంతో కలిసి మేడిపల్లి సత్యనారాయణపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. మహేందర్, ఆయన భార్య ధరణి కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద కూలి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో వారి కుమారుడు మహేష్ (5) శుక్రవారం అక్కడే ఆటలాడుకుంటూ వెళ్లి, మూత లేకుండా తెరిచి ఉంచిన నీటితో నిండిన సంపులో ప్రమాదవశాత్తు పడిపోయాడు. కొంతసేపటి తర్వాత బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనగా వెతికారు. అనంతరం సంపులో బాలుడు కనిపించడంతో బయటకు తీశారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిర్మాణ ప్రదేశంలో కనీస భద్రతా చర్యలు చేపట్టకుండా సంపును తెరిచి ఉంచడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story