Hyderabad: విజయవాడ వెళ్తానని చెప్పి వ్యక్తి అదృశ్యం: పోచారంలో కేసు నమోదు!
Hyderabad: విజయవాడలో బ్యాంకు పని ఉందని చెప్పి బయలుదేరిన శివరామకృష్ణ (55) అనే వ్యక్తి అదృశ్యమయ్యారు.
Hyderabad: విజయవాడ వెళ్తానని చెప్పి వ్యక్తి అదృశ్యం: పోచారంలో కేసు నమోదు!
Hyderabad: విజయవాడలో బ్యాంకు పని ఉందని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన శివరామకృష్ణ (55) అనే వ్యక్తి అదృశ్యమయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ జగన్నాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. పోచారంలోని గెలాక్సీ టవర్స్‌లో నివాసముంటున్న వినకొట వెంకట సాయి జగన్నాథ పవన్ (28) తన భార్య సంవిధ, అత్త శ్వేతకుమారి, మామ శివరామకృష్ణతో కలిసి అక్టోబర్ 3న విజయవాడ నుంచి పోచారం వచ్చారు.
మార్గమధ్యలో శ్వేతకుమారిని అబ్దుల్లాపూర్‌మెట్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీ వద్ద దింపి, భార్య, మామతో కలిసి పోచారం చేరుకున్నారు. అక్టోబర్ 4న శివరామకృష్ణ విజయవాడలో బ్యాంకు పని ఉందని చెప్పడంతో.. అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు పవన్ ఆయనను అన్నోజిగూడ ఫ్లైఓవర్ కింద బస్టాప్ వద్ద దింపి వెళ్లారు.
మరుసటి రోజు ఉదయం కుమార్తె సంవిధ ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. స్నేహితులు, బంధువులను సంప్రదించినా ఆచూకీ లభించకపోవడంతో పవన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శివరామకృష్ణ ఎత్తు సుమారు 5.6 అడుగులు. అదృశ్యమైన సమయంలో తెల్లటి చొక్కా, నీలిరంగు జీన్స్ ధరించి ఉన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ మాట్లాడగలరని పోలీసులు తెలిపారు.




