Saroornagar: ముగిసిన పోలీస్ క్రీడలు 140 మెడల్స్‌తో హైదరాబాద్ రికార్డ్!

Saroornagar: పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరిగిన 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్ – 2026 (Cluster-A) సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ముగిసింది.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 9 July 2026 7:47 PM IST
Saroornagar
X

Saroornagar: ముగిసిన పోలీస్ క్రీడలు 140 మెడల్స్‌తో హైదరాబాద్ రికార్డ్!

సరూర్నగర్: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్ – 2026 (Cluster-A) రెండు రోజుల పాటు ఉత్సాహభరిత పోటీల అనంతరం ఈరోజు ఎల్బీనగర్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం లో 09.07.2026 న ఘనంగా ముగిసింది.

08 మరియు 09 జూలై 2026 తేదీలలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ యూనిట్లకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ క్రీడలను 08.07.2026 న తెలంగాణ రాష్ట్ర DGP శ్రీ C.V. ఆనంద్, IPS గారు Sports Torch ప్రజ్వలింపజేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో Smt. B. సుమతి, IPS, CP మల్కాజిగిరి, శ్రీ V.C. సజ్జనార్, IPS, CP హైదరాబాద్, డా. గజారావు భూపాల్, IPS, IGP (P&L & Sports), సినీ నటుడు శ్రీ నవీన్ పోలిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Cluster-A లో 14 Indoor Events:

Wrestling, Boxing, Body Building, Arm Wrestling, Weight Lifting, Power Lifting, Yoga, Judo, Wushu, Taekwondo, Karate, Pencak Silat, Fencing, Gymnastics పోటీలు వివిధ వెయిట్ కేటగిరీల్లో జరిగాయి.

పాల్గొన్నవారు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 21 Police Units నుండి మొత్తం 831 మంది పోలీస్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో 683 మంది పురుషులు, 148 మంది మహిళలు ఉన్నారు.

పతకాల వివరాలు:

ప్రథమ స్థానం: Hyderabad Commissionerate - 140 పతకాలు (64 Gold, 44 Silver, 32 Bronze)

ద్వితీయ స్థానం: TGSP-II - 58 పతకాలు (19 Gold, 16 Silver, 23 Bronze)

తృతీయ స్థానం: Malkajgiri Commissionerate - 58 పతకాలు (12 Gold, 20 Silver, 26 Bronze)

విజేతలకు శ్రీ K. సురేష్ కుమార్, IPS, DCP ఉప్పల్ జోన్, శ్రీ K. శ్యామ్ సుందర్, DCP CAR, మల్కాజిగిరి గార్లు పతకాలు ప్రదానం చేశారు.

ఈ సంవత్సరం నుంచి తెలంగాణ పోలీస్ గేమ్స్ ను All India Police Games Calendar కు అనుగుణంగా Cluster-wise Format A, B, C, D & E లో నిర్వహిస్తున్నారు.

Cluster-C పోటీలు సెప్టెంబర్-2026 లో RBVRR తెలంగాణ పోలీస్ అకాడమీలో, Cluster-B నవంబర్ లో Future City Commissionerate లో, Cluster-D వరంగల్ Commissionerate లో, Cluster-E మరియు Closing Ceremony నవంబర్-2026 లో నిజామాబాద్ Commissionerate లో జరగనున్నాయి.

ఈ క్రీడలు పోలీస్ సిబ్బందిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు, శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు మరియు జాతీయ స్థాయి పోటీలకు క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు వేదికగా నిలుస్తున్నాయి.

Cluster-A విజయవంత నిర్వహణకు కృషి చేసిన అన్ని స్థాయి అధికారులు, సిబ్బందికి మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కృతజ్ఞతలు తెలియజేసింది.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story