Saroornagar: ఘనంగా ప్రారంభమైన 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ !

Saroornagar: ఇండోర్ స్టేడియంలో 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్ – 2026 (క్లస్టర్-ఎ) ప్రారంభమైంది సి.వి. ఆనంద్ క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 8 July 2026 4:09 PM IST
Saroornagar
X

Saroornagar: ఘనంగా ప్రారంభమైన 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ !

సరూర్నగర్: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్ – 2026 (క్లస్టర్-ఎ) మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.

తెలంగాణ డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ గారు క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సీపీ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్, సీపీ శ్రీ వి.సి. సజ్జనార్, ఐపీఎస్, ఐజీ డా. గజరావు భూపాల్, ఐపీఎస్, ప్రముఖ సినీ హీరో శ్రీ నవీన్ పొలిశెట్టి, అన్ని జోన్ల డీసీపీలు, ఉన్నతాధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

ఆర్‌ఐ శ్రీ ప్రమోద్ కుమార్ నేతృత్వంలో గౌరవ వందన కవాతు జరిగింది. సీపీ శ్రీమతి బి. సుమతి స్వాగత ప్రసంగంలో క్రీడలు క్రమశిక్షణ, జట్టుకృషి, శారీరక దృఢత్వానికి నిదర్శనమని అన్నారు.

ఐజీ డా. గజరావు భూపాల్ మాట్లాడుతూ 21 పోలీస్ యూనిట్ల నుండి 831 మంది సిబ్బంది - 683 మంది పురుషులు, 148 మంది మహిళలు 14 ఇండోర్ క్రీడల్లో పాల్గొంటున్నారని తెలిపారు.

సీపీ శ్రీ వి.సి. సజ్జనార్ క్రీడలు పోలీసులకు క్రమశిక్షణ, నాయకత్వం పెంచుతాయన్నారు.

హీరో నవీన్ పొలిశెట్టి "పోలీసులే నిజమైన హీరోలు" అంటూ పోలీసుల సేవలను కొనియాడారు.

డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ ఈ ఏడాది నుండి ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ తరహాలో క్లస్టర్ విధానంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. క్లస్టర్-ఎ లో రెజ్లింగ్, బాక్సింగ్, యోగా, జూడో, కరాటే సహా 14 ఇండోర్ ఈవెంట్లు ఉన్నాయి. మిగిలిన క్లస్టర్లు రాష్ట్రంలోని వివిధ యూనిట్లలో, ముగింపు కార్యక్రమం నిజామాబాద్ లో జరుగుతుందని వెల్లడించారు.

"క్రీడలు ఒక రకమైన ధ్యానం లాంటివి. ఒత్తిడి తగ్గించి, ఆరోగ్యం, పనితీరు మెరుగుపరుస్తాయి" అని డీజీపీ పేర్కొన్నారు.

కార్యక్రమం చివరలో డీసీపీ శ్రీమతి బి. అనూరాధ, ఐపీఎస్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ రెండు రోజుల పోటీలు 09.07.2026 తో ముగుస్తాయి

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story