Ghatkesar: వేగంగా వచ్చిన రైలు.. రెప్పపాటులో ప్రాణాలు గాలిలో!

Ghatkesar: ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గాంధీనగర్‌కు చెందిన వృద్ధుడు బ్రహ్మచారి (65) దుర్మరణం చెందారు.

KARUNAKAR, UPPAL
Published on: 12 May 2026 11:16 AM IST
Ghatkesar
X

Ghatkesar: వేగంగా వచ్చిన రైలు.. రెప్పపాటులో ప్రాణాలు గాలిలో!

ఘట్‌ కేసర్: ఘట్‌ కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఘట్‌ కేసర్ గాంధీనగర్‌కు చెందిన బ్రహ్మచారి (65) రైల్వే పట్టాలు దాటుతుండగా భువనగిరి నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ప్రమాదం ఘట్‌ కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలోని 214/5, 214/7 మైలు రాళ్ల మధ్య జరిగింది. రైలు బలంగా ఢీకొనడంతో మృతుడి శరీరం ముక్కలు ముక్కలుగా మారి చెల్లాచెదురుగా పడిపోయింది. ఘటనను చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహ అవశేషాలను సేకరించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైల్వే పట్టాలు దాటేటప్పుడు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story