Vikarabad: మున్సిపల్ పాలకమండలిపై కౌన్సిలర్ జావిద్ ఫైర్!

Vikarabad: తన సొంత ఖర్చుతో చెత్తబుట్టలను ఏర్పాటు చేసిన కౌన్సిలర్ జావిద్, వార్డు అభివృద్ధిలో మున్సిపల్ అధికారులు వివక్ష చూపుతున్నారని విమర్శించారు.

Srikanth Reddy, Tandur
Published on: 9 July 2026 10:28 PM IST
Vikarabad
X

Vikarabad: మున్సిపల్ పాలకమండలిపై కౌన్సిలర్ జావిద్ ఫైర్!

వికారాబాద్: నిరంతరం ప్రజల మధ్య ఉంటూ 8వ వార్డు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, అధికార పక్షానికి ఎదురెొడ్డి వార్డు ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడంలో అనునిత్యం ముందుంటున్నానని 8వ వార్డ్ కౌన్సిలర్ జావిద్ అన్నారు. గురువారం తన వార్డులో సొంత కర్చులతో చెత్తబుట్టలను ఏర్పాటు చేయించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ జావిద్ మాట్లాడుతూ.స్థానిక ఎమ్మెల్యే మున్సిపాల్టీ చైర్ పర్సన్ తూతూ మంత్రంగా వార్డులో కార్యక్రమాలు నిర్వహించడమే తప్ప తమ వార్డు అభివృద్ధికి ఎప్పుడూ సహకరించలేదన్నారు. ఇకనైనా కాంగ్రెస్ కౌన్సిలర్ల వార్డులు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో తన వార్డును కూడా అదే విధంగా అభివృద్ధి చేయాలన్నారు.

తాను నిరంతరం ప్రజల పక్షాన ఉంటూ వార్డు అభివృద్ధి కొరకు అధికారపక్షంతో పోట్లాడి నిధులు సమకూర్చుతానన్నారు. వార్డు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story