Medchal: మేడ్చల్‌లో రవాణా శాఖ దాడులు.. 9 స్కూల్ బస్సులు సీజ్!
Medchal: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రవాణా శాఖ అధికారుల స్పెషల్ డ్రైవ్. ఫిట్‌నెస్, పత్రాలు లేని 9 ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేసిన అధికారులు.
Medchal: మేడ్చల్‌లో రవాణా శాఖ దాడులు.. 9 స్కూల్ బస్సులు సీజ్!
Medchal: 9 బస్సులు సీజ్ చేసిన అధికారులు.. స్కూల్ బస్సులపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రవాణా శాఖ అధికారుల దాడులు. ఈరోజు నుండి ప్రైవేట్ పాఠశాలలు పున ప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే స్కూల్ బస్సుల పై ఈరోజు ఉదయం నుండి ప్రత్యేక దృష్టి సారించిన రవాణా శాఖ. కుత్బుల్లాపూర్, బహదూర్ పల్లి X రోడ్డు వద్ద RTO స్పెషల్ డ్రైవ్ " నిర్వహించారు ఫిట్నెస్ మరియు సరైన పత్రాలు లేని 9 ప్రవేట్ స్కూల్ బస్సులు సీజ్.
ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న రవాణా శాఖ అధికారులు. బస్సు కు సంబంధించిన ఆర్సి పర్మిట్ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ పొల్యూషన్ తో పాటు డ్రైవర్ లైసెన్స్ చెక్ చేస్తున్న అధికారుల బృందం. విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులో సేఫ్టీల విషయంలో ప్రత్యేక దృష్టి.
బస్సులో ఉండాల్సిన ఫైర్ ఎక్స్టెండ్ దిస్వార్ మెడికల్ కిట్ విద్యార్థుల లిస్ట్ తోపాటు అనుభవం కలిగిన డ్రైవర్ బస్సు నడుపుతున్నాడు అనే విషయాలను పరిశీలిస్తున్న అధికారులు. 60 సంవత్సరాలు పైబడిన డ్రైవర్లు ఉన్నారని కోణంలో ప్రత్యేక డ్రైవ్.




