Hyderabad: హైదరాబాద్‌లో ఘనంగా గడ్డం వెంకటస్వామి 97వ జయంతి వేడుకలు!
Hyderabad: హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో ఘనంగా జరిగిన కాకా వెంకటస్వామి 97వ జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్.
Hyderabad: హైదరాబాద్‌లో ఘనంగా గడ్డం వెంకటస్వామి 97వ జయంతి వేడుకలు!
Hyderabad: దివంగత మాజీ కేంద్ర మంత్రి, ప్రజల మనిషి గడ్డం వెంకటస్వామి (కాకా) 97వ జయంతి వేడుకలను సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. బాగ్‌లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాలేజ్ వద్ద ఉన్న కాకా విగ్రహానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గడ్డం వెంకటస్వామి ప్రజాసేవను, కార్మికులు, పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిని ఎమ్మెల్యే స్మరించుకున్నారు. ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ దావ స్వాతి రమేష్ బాబు, కౌన్సిలర్లు, బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కాకా అభిమానులు పాల్గొన్నారు. కాకా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకా ఆశయ సాధనకు కృషి చేస్తామని నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు.




