Hyderabad: అమెరికా నుండి హైదరాబాద్‌కు.. అదిత్రి కూచిపూడి అరంగేట్రం!

Hyderabad: అమెరికాలో పెరిగినా కూచిపూడిపై మక్కువతో అదిత్రి వైష్ణవి చేపూర్ తన అరంగేట్రం ఘనంగా నిర్వహించుకుంది.

RAJESH,	WEST ZONE
Published on: 22 Jun 2026 9:35 AM IST
Hyderabad
X

Hyderabad: అమెరికా నుండి హైదరాబాద్‌కు.. అదిత్రి కూచిపూడి అరంగేట్రం!

Hyderabad: అమెరికాలో పుట్టి పెరిగిన అదిత్రి వైష్ణవి చేపూర్ కూచిపూడి అరంగేట్రం నగరంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. బేగంపేటలోని సెస్ ఆడి టోరియంలో ప్రముఖులతో పాటు ఆమె రెండు తరాల కుటుంబసభ్యుల మధ్య అరంగేట్రం చేసి తన కలను సాకారం చేసుకుంది.

గురువు రేవతి కొమండూరి వద్ద నృత్యం నేర్చుకున్న ఆమె వేదిక పై అద్భుతమైన హావభావాలు పలికించి అబ్బురపరిచారు. అన్నమాచార్య కీర్తనతో సాగిన అరంగేట్ర నృత్య ప్రయాణం శివుని స్తుతిస్తూ తాండవేశ్వర.. చివరగా థిల్లానాతో ముగిసింది.

అదిత్రి వెష్ణవి తల్లిదండ్రులు భానుచందర్, సరితలు అమెరికన్ సిటిజన్స్ కాగా.. వారి కూతురు అదిత్రిలా అండ్ సైకాలజీ శాస్త్రంలో విద్యనభ్యసిస్తున్నారు. తన ఏడేళ్ల ప్రాయం నుంచి కూచిపూడి నృత్య శిక్షణ తీసుకుంటూ వచ్చారు.

నగరంలో ఉండే తాత య్యలు, అమ్మమ్మ, నాన్నమ్మలు ముందు తన అరంగేట్రం జరగాలన్న ఆమె కోరికను నెరవేర్చుకున్నారు. మనవరాలి కూచిపూడి అరంగేట్రం తిలకించిన నాన్నమ్మ, తాతయ్య దేవి, జనార్దన్రావు, అమ్మమ్మ, తాతయ్య మంజులత, శ్యాంసుందర్లు ఆనందం వ్యక్తం చేశారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story