Sabitha Indra Reddy: మరమ్మతులు ఎప్పుడు? రేవంత్ రెడ్డిని నిలదీసిన సబిత

Sabitha Indra Reddy: పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టేను స్వాగతించిన సబితా ఇంద్రారెడ్డి. ఇది కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు అని వ్యాఖ్య.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 23 April 2026 6:27 PM IST
Sabitha Indra Reddy
X

Sabitha Indra Reddy: మరమ్మతులు ఎప్పుడు? రేవంత్ రెడ్డిని నిలదీసిన సబిత

Sabitha Indra Reddy: పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు: BRS మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన స్టేను స్వాగతిస్తూ మహేశ్వరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలకు గట్టి చెంపపెట్టుగా నిలిచిందన్నారు.

ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం ద్వారా, రాజకీయ కక్షసాధింపుల కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే గౌరవ న్యాయస్థానాలు కఠినంగా స్పందిస్తాయని మరోసారి నిరూపితమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజకీయ కుట్రలను పక్కన పెట్టి రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. రెండున్నరేళ్లుగా కల్పతరువులాంటి కాలేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న రెండు పిల్లర్లను వెంటనే మరమ్మతు చేసి, లక్షలాది మంది రైతులకు సాగునీరు అందించాలని కోరారు. రెండు నెలల్లోనే మరమ్మత్తులు చేయవచ్చని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత రెండు సంవత్సరాలుగా ఎందుకు నిర్లక్ష్యం వహించిందని ఆమె ప్రశ్నించారు. గోదావరి జలాలను ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తూ, తెలంగాణ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నాలు కొనసాగితే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రైతులకు నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హయాంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించగా, ప్రస్తుత ప్రభుత్వం గంటల తరబడి పవర్ కట్స్ విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. అలాగే, తాగునీరు, సాగునీటి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story