Abdullapurmet: అబ్దుల్లాపూర్ మెట్‌లో ఘనంగా AISF ఆవిర్భావ వేడుకలు
Abdullapurmet: అబ్దుల్లాపూర్ మెట్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఘనంగా ఏఐఎస్‌ఎఫ్ 91వ ఆవిర్భావ వేడుకలు. జెండా ఆవిష్కరించిన రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ కాటి శ్రావణి.
Abdullapurmet: అబ్దుల్లాపూర్ మెట్‌లో ఘనంగా AISF ఆవిర్భావ వేడుకలు
అబ్దుల్లాపూర్ మెట్: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) 90 ఏళ్ల విద్యార్థి ఉద్యమ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 91వ ఆవిర్భావ దినోత్సవంలోకి అడుగుపెట్టిన సందర్భంగా AISF అబ్దుల్లాపూర్ మెట్ మండల సమితి ఆధ్వర్యంలో సంజయ్ గాంధీ మెమోరియల్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
AISF రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, అబ్దుల్లాపూర్ మెట్ మండల అధ్యక్షులు కామ్రేడ్ భూక్యా వినోద్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి AISF రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. AISF రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ కౌన్సిల్ సభ్యురాలు కాటి శ్రావణి జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం AISF నిరంతరం పోరాడుతుందని నాయకులు పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించడంతో పాటు వారి హక్కుల సాధన కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో AISF అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి చింత వెంకటేష్, సహాయ కార్యదర్శి సత్యం, కార్యవర్గ సభ్యులు ఆందోజు నిఖిల్, చందు, అరవింద్, రామ్ చరణ్, శశిధర్, వినీత్, రాకేష్, రోహిత్‌తో పాటు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




