Abdullapurmet: అవంతి ఇన్‌స్టిట్యూట్‌లో ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు
Abdullapurmet: అబ్దుల్లాపూర్మెట్ అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు. హాజరైన అవంతి గ్రూప్ చైర్మన్ అవంతి శ్రీనివాసరావు, డా. ఎల్. రామకృష్ణ.
Abdullapurmet: అవంతి ఇన్‌స్టిట్యూట్‌లో ఘనంగా ఇంజినీర్స్ డే వేడుకలు
అబ్దుల్లాపూర్మెట్: భారతరత్న సర్ ఎం. విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని అవంతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇంజినీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా అవంతి గ్రూప్ చైర్మన్ అవంతి శ్రీనివాసరావు, ఏఆర్‌సీఐ అసోసియేట్ డైరెక్టర్ డా. ఎల్. రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ నిర్మాణం, సమాజ అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలతో పాటు వినూత్న ఆలోచనలు, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రాక్టికల్ లెర్నింగ్‌పై దృష్టి సారిస్తూ నూతన సాంకేతికతలను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఇంజినీర్ల సేవలు మౌలిక సదుపాయాలు, పరిశ్రమల అభివృద్ధిలో ఎంతో కీలకమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు సాంకేతిక పోటీలు, ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.




