Abdullapurmet: రాగన్నగూడ రోడ్డు గుంతల్లో వరి నాట్లు వేసి నిరసన
Abdullapurmet: రాగన్నగూడ రోడ్డు దుస్థితిపై జీహెచ్‌ఎంసీ అధ్యక్షుడు ఎలిమినేటి నరసింహారెడ్డి నిరసన. రోడ్డుపై నీరు నిలిచిన గుంతల్లో వరి నాట్లు వేసిన నాయకులు.
Abdullapurmet: రాగన్నగూడ రోడ్డు గుంతల్లో వరి నాట్లు వేసి నిరసన
అబ్దుల్లాపూర్మెట్: అబ్దుల్లాపూర్మెట్ మండల్ రాగన్నగూడ విలేజ్ రోడ్డు లోని పూర్తిగా అధ్వానంగా మారింది. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వర్షపు నీరు అక్కడే నిలిచిపోతోంది. దీంతో స్థానిక వాసులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అని తెలుసుకుని.
ఈ రోజు 53-56 డివిజన్ GHMC అధ్యక్షులు ఎలిమినేటి నరసింహారెడ్డి స్థానిక నాయకులతో కలిసి గుంతలో వరి నాటు వేశారు రాగన్నగూడ విలేజ్ రోడ్డుపై నీరు నిలిచి, గుంతల కారణంగా బైక్ స్లిప్ అయ్యే ప్రమాదం, పిల్లలు, వృద్ధులు కింద పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ...
"రాగన్నగూడ రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది. చిన్న వర్షానికి కూడా గుంతల్లో నీరు నిలిచి దోమలకు ఆవాసంగా మారుతోంది. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. GHMC అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డును రిపేర్ చేసి, నీరు నిల్వకుండా డ్రైనేజ్ వ్యవస్థను సరిచేయాలి" అని డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో సురేష్ నందగిరి. పన్నాల సురేందర్ రెడ్డి బాలకృష్ణ గౌడ్. శేఖర్ రెడ్డి, మల్లేష్,నితిన్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




