LB Nagar: హనుమాన్ దేవాలయంలో సందడి.. ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవం
LB Nagar: RTC సూపర్వైజర్స్ కాలనీలో శ్రీ ఉత్తర బ్రహ్మ అభయాంజనేయ స్వామి ప్రాణ ప్రతిష్ఠ, కుంభాభిషేకం భక్తిశ్రద్ధలతో జరిగాయి.
LB Nagar: హనుమాన్ దేవాలయంలో సందడి.. ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవం
LB Nagar: మన లెక్చరర్స్ కాలనీ డివిజన్ పరిధిలోని RTC సూపర్వైజర్స్ కాలనీలో నూతనంగా నిర్మితమైన శ్రీ శ్రీ శ్రీ ఉత్తర బ్రహ్మ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు నిర్వహించిన యంత్ర స్థాపన, ప్రాణ ప్రతిష్ఠ, మహా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది. ఈ పుణ్యకార్యాన్ని పురస్కరించుకుని, ఆలయ నిర్మాణానికి మా వంతు సహకారంగా *₹25,200/- విరాళాన్ని ఆలయ కమిటీ వారికి అందజేయడం జరిగింది. ఈ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులను, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులను, కాలనీ వాసులను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి దాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
Next Story




