Maheshwaram: మహేశ్వరం ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలల బంద్
Maheshwaram: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలని మహేశ్వరంలో ఏబీవీపీ నిరసన. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలను బంద్ చేసిన విద్యార్థులు.
Maheshwaram: మహేశ్వరం ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలల బంద్
మహేశ్వరం: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) రాష్ట్ర పిలుపు మేరకు మహేశ్వరం శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలను బంద్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏబీవీపీ మహేశ్వరం నగర కార్యదర్శి నునావత్ రాజేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ.11,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, నునావత్ రాజేష్,గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ రాఘవేంద్ర, ప్రణీత్, అభిలాష్, రోహిత్, రాహుల్,సాయికార్తిక్,ఉదయ్,కార్తీక్,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.




