Osmania University: ఘనంగా ఏబీవీపీ 78వ ఆవిర్భావ వేడుకలు
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం.
Osmania University: ఘనంగా ఏబీవీపీ 78వ ఆవిర్భావ వేడుకలు
ఉస్మానియా యూనివర్సిటీ: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ కళాశాల ఆధ్వర్యంలో ఎబివిపి 78వ ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోని వివిధ కళాశాలలో జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎబివిపి నాయకులు మాట్లాడుతూ, 1949 జూలై 9న స్థాపించబడిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా విద్యార్థుల హక్కుల పరిరక్షణ, జాతీయతా భావ వికాసం, నాణ్యమైన విద్య, సమాజ సేవ అనే లక్ష్యాలతో నిరంతరం పనిచేస్తోందని అన్నారు. విద్యార్థి సమస్యల పరిష్కారమే కాకుండా సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దడంలో ఎబివిపి కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డా.శ్రీహరి, విద్యానగర్ విభాగ కన్వీనర్ హరిప్రసాద్, స్టేట్ యూనివర్సిటీస్ కో కన్వీనర్ గంధం నరేందర్, స్టేట్ లా ఫోరం కో కన్వీనర్ వెంకటేష్,ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు గెల్లు శేఖర్, కార్యదర్శి మోక్షిత్, హరిచంద్ర, మోహన్ బాబు, భాస్కర్, శివ, విజయ్ సింగ్, జశ్వంత్, శ్రీకర్, నితిన్, భాను ప్రకాష్, తన్మై, శ్రీకర్, హరీష్, చేతన్, ధనరాజ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




