Hyderabad: రాజ్యాంగ సంస్థలపై రాజకీయ విమర్శలు తగవు ఏబీవీపీ ఖండన!
Hyderabad: రాజ్యాంగబద్ధ సంస్థలు, న్యాయవ్యవస్థపై కాంగ్రెస్, ప్రతిపక్షాల విమర్శలను ఖండించిన ఏబీవీపీ ఉస్మానియా వర్సిటీ నాయకులు. ఎస్ఐఆర్ ప్రక్రియపై నిరాధార ఆరోపణలు వద్దు.
Hyderabad: రాజ్యాంగ సంస్థలపై రాజకీయ విమర్శలు తగవు ఏబీవీపీ ఖండన!
Hyderabad: హైదరాబాద్ రాజ్యాంగబద్ధ సంస్థలు, న్యాయవ్యవస్థపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ నాయకులు ఖండించారు. ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.
రాజ్యాంగబద్ధ సంస్థలు, స్వతంత్ర న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటివని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాటిపై నిరాధార ఆరోపణలు చేయడం వల్ల ప్రజల్లో అపోహలు ఏర్పడటంతోపాటు వ్యవస్థలపై విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందన్నారు. ఓటర్ల జాబితాల పారదర్శకత, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం పెంపొందించేందుకు వాస్తవాల ఆధారంగా చర్చ జరగాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై అభ్యంతరాలు ఉంటే రాజ్యాంగబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో విమర్శలకు, భిన్నాభిప్రాయాలకు స్థానం ఉందని, అయితే రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజల్లో అపనమ్మకం కలిగించేలా వ్యవహరించడం బాధ్యతాయుత రాజకీయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువలను, న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విద్యార్థులు వాస్తవాలను పరిశీలించి, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కార్యదర్శి పృథ్వీతేజ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అలివేలి రాజు, విద్యానగర్ జిల్లా కన్వీనర్ సాయితేజ, విక్రమాదిత్య, అజయ్, విజయ్, తన్మయ్, శివమణి, బాలరాజు, రిషి తదితరులు పాల్గొన్నారు.




