Pargi: సీజ్ చేసినా క్లాసులు నడుపుతారా? అధికారులపై ఏబీవీపీ ఆగ్రహం!

Pargi: చైతన్య స్కూల్‌లో అనుమతి లేకుండా 9, 10 తరగతులు నిర్వహిస్తున్నారని ఏబీవీపీ ఆరోపించింది. అధికారులు సీజ్ చేసినా క్లాసులు నడపడంపై మండిపడింది.

WAZID, PARIGI
Published on: 14 July 2026 4:32 PM IST
Pargi
X

Pargi: సీజ్ చేసినా క్లాసులు నడుపుతారా? అధికారులపై ఏబీవీపీ ఆగ్రహం!

PARGI: వికారాబాద్ జిల్లా పరిగిలోని చైతన్య స్కూల్‌ ఇష్టా రాజ్యాంగ మారింది.. 9వ, 10వ తరగతులకు ప్రభుత్వ అనుమతులు లేకపోయినా విద్యార్థులను చేర్చుకుని తరగతులు నిర్వహిస్తున్నారు.జూన్ 24 వ తేదీ రోజు విద్యాశాఖ అధికారులు వచ్చి సీజ్ చేసిన వారి సీజ్ తుంగలో కలిపారా లేక, విద్యాశాఖ అధికారులతో కుమ్మక్కై తరగతులు నడుపుతున్నారా అని ఎబివిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు లేకుండానే దాదాపు 80 మంది విద్యార్థులను అడ్మిషన్ తీసుకుని క్లాసులు నిర్వహిస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు.

జూన్ 24న ఎంఈఓ స్కూల్‌ను సీజ్ చేసినప్పటికీ, ఆ ఆదేశాలను పట్టించుకోకుండా యాజమాన్యం మళ్లీ తరగతులు నిర్వహిస్తోందని వారు పేర్కొన్నారు.ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎంఈఓ, డీఈఓ అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. తమ ఫిర్యాదు మేరకు పరిశీలనకు వెళ్లగా, అక్కడ తరగతులు కొనసాగుతున్నట్లు గుర్తించామని తెలిపారు.

అంతేకాకుండా, ఈ విషయం బయటకు చెప్పొద్దని విద్యార్థులను భయపెడుతున్నారని కూడా ఏబీవీపీ నాయకులు ఆరోపించారు.ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకుని బాధ్యులపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.80 మంది పిల్లల భవిష్యత్తు తో చెలగాటం ఆడుతున్నారని వాపోతున్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story