Tarnaka: ఓయూ ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌లో ఏబీవీపీ శ్రమదానం!
Tarnaka: జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఓయూ ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌లో ఏబీవీపీ, ఎస్ఎఫ్‌డీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి, శ్రమదానం నిర్వహించారు.
Tarnaka: ఓయూ ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌లో ఏబీవీపీ శ్రమదానం!
తార్నాక: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ, స్టూడెంట్స్ ఫర్ డెవలప్‌మెంట్ (SFD) ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌లో "క్లీన్ క్యాంపస్ – గ్రీన్ క్యాంపస్" కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలు ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌లోని సరస్సు పరిసరాలను పరిశుభ్రం చేసి, అందులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను తొలగించారు. గార్డెన్ పరిసరాలను కూడా శుభ్రపరిచి పరిశుభ్రమైన క్యాంపస్ నిర్మాణానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు.
ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు గెల్లు శేఖర్ మరియు కార్యదర్శి మోక్షిత్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌కు ఉదయం వాకింగ్, రన్నింగ్‌కు వచ్చే వారు, విద్యార్థులు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలని, క్యాంపస్‌ను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.అలాగే "మన క్యాంపస్ – మన బాధ్యత, మన క్యాంపస్ – మన భవిష్యత్తు" అనే సందేశాన్ని అందరికీ తెలియజేస్తూ, ప్రతి విద్యార్థి పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రెటరీ పృద్వితేజ, విద్యానగర్ విభాగ్ కన్వీనర్ హరిప్రసాద్, విద్యానగర్ జిల్లా కన్వీనర్ సాయి తేజ, విజయ్ సింగ్, వీరబాబు, మోహన్ బాబు, సాయి తేజ, శివ, విద్యార్థులు మరియు ఉదయం వాకింగ్‌కు వచ్చిన పలువురు పాల్గొన్నారు.




