Nagole: నాగోల్ ఆర్టీఏ ఆఫీస్‌లో ఏసీబీ ఆకస్మిక దాడులు.. కలకలం!

Nagole: హైదరాబాద్ నాగోల్ జగ్జీవన్ రామ్ ఆర్టీఏ (RTA) కార్యాలయంలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 27 May 2026 4:02 PM IST
Nagole
X

Nagole: నాగోల్ ఆర్టీఏ ఆఫీస్‌లో ఏసీబీ ఆకస్మిక దాడులు.. కలకలం!

నాగోల్: హైదరాబాద్ సెంట్రల్ పరిధిలోని నాగోల్ జగ్జీవన్ రామ్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏజెంట్ల ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఇతర వాహన రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరుగుతున్నాయనే సమాచారంతో హైదరాబాద్ రేంజ్ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి.

ఈ దాడులతో ఆర్టీఏ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆర్టీఏ ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాకుండా కార్యాలయంలోని ఎంవీఐలు, ఏఎంవీఐలను సైతం ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.

అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఏజెంట్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌లను పరిశీలిస్తున్నారు. లైసెన్స్‌ల జారీ, రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. హైద్రాబాద్ రేంజ్ డిఎస్పీ గంగసాని శ్రీదర్ మాట్లాడుతూ ప్రస్తుతానికి 12మంది ఎంజెంట్లను అదుపులోకి తీసుకున్నాము, 40మంది స్టాఫ్ కి విచారిస్తున్నామని తెలిపారు... విచారణ లో పూర్తిస్తాయి లో వివరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story