Chevella: రూ. లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్టీవో, అసిస్టెంట్ ఎస్టీవో!
Chevella: చేవెళ్ల సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు. రిటైర్డ్ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్టీవో లక్ష్మణ్, అసిస్టెంట్ ఎస్టీవో అనురాధ.
Chevella: రూ. లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్టీవో, అసిస్టెంట్ ఎస్టీవో!
చేవెళ్ల: రిటైర్డ్ పంచాయతీ కార్యదర్శి నుంచి 2 లక్షల 50 వేలు రూపాయలను డిమాండ్ చేసిన ఎస్టిఓ అధికారి ఎం లక్ష్మణ్, అసిస్టెంట్ ఎస్టిఓ అధికారిని కే అనురాధ. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఈరోజు దాడులు నిర్వహించడం జరిగింది.
బాధితుని దగ్గర నుంచి లక్ష రూపాయలను ఎస్టీవో అధికారి 50,000, అసిస్టెంట్ ఎస్టీవో అధికారిని 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అసిస్టెంట్ ఎస్టిఓ అధికారిని కే అనురాధ తను పర్సనల్గా నియమించుకున్న జంగయ్య చిన్న అనే వ్యక్తి ద్వారా 50,000 తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
వారిని అదుపులోకి తీసుకొని చేవెళ్ల ఏసిపి కార్యాలయంలో విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. పట్టుబడిన అధికారుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు డిఎస్పి తెలిపారు. బాధితుని పేరు వివరాలు గోప్యంగా ఉంచాలనే నెపంతో తెలియపరచడం లేదని ఆయన మీడియాకు తెలపడం జరిగింది.




