Hyderabad: వ్యాధి బారిన పడకముందే జాగ్రత్తలు అవసరం ఆచార్య మనీష్
Hyderabad: వ్యాధులు రాకముందే ఆయుర్వేద జీవనశైలితో జాగ్రత్తలు తీసుకోవాలని ఆచార్య మనీష్ పిలుపు. సోమాజిగూడలోని సెంటర్‌లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.
Hyderabad: వ్యాధి బారిన పడకముందే జాగ్రత్తలు అవసరం ఆచార్య మనీష్
Hyderabad: వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స పొందడం కంటే, వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని ఆయుర్వేద నిపుణులు ఆచార్య మనీష్ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు, జీవనశైలిపై అవగాహన కల్పించేందుకు తాను,తన వైద్య బృందంతో కలిసి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దేశంలో కిడ్నీ,లివర్,గుండె సంబంధిత వ్యాధులు,క్యాన్సర్, మధుమేహం,రక్తపోటు వంటి సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్’ కంటే ‘ప్రివెన్షన్ ఈజ్ ది ఓన్లీ క్యూర్’ అనే నినాదంతో తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు.
దేశవ్యాప్తంగా తమకు 120కి పైగా ఆయుర్వేద క్లినిక్‌లు, ఆసుపత్రులు,వెల్‌నెస్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు,చెన్నై,పాట్నా, కోల్‌కతా,ఢిల్లీ,ముంబై, చండీగఢ్,లూధియానా, డెహ్రాడూన్ తదితర నగరాల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తీవ్రమైన వ్యాధులకు సంబంధించి వ్యక్తిగత అనుభవాలను సాధారణ వైద్యపరమైన నిర్ధారణగా పరిగణించరాదని అర్హత కలిగిన వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు.
వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేదంలో ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన విధానాలను సూచించారని, పంచకర్మ వంటి విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయుర్వేద వైద్యాన్ని ఆరోగ్య పథకాల్లో మరింత విస్తృతంగా చేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలకు ఆయుర్వేద చికిత్స అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్య సలహాల కోసం హైదరాబాద్‌లో తమ ఆయుర్వేద కేంద్రం రాజ్‌భవన్ రోడ్,సోమాజిగూడలో ఉందని తెలిపారు.




