Chilukur: రాష్ట్రంలోనే రెండో స్థానం సాధించిన ఆచార్యుల గూడెం!

Chilukur: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం ఆచార్యుల గూడెం గ్రామంలో 100% ఓటరు జాబితా సవరణ పూర్తయింది.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 21 July 2026 2:12 PM IST
Chilukur
X

Chilukur: రాష్ట్రంలోనే రెండో స్థానం సాధించిన ఆచార్యుల గూడెం!

రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఆచార్యుల గూడెం...

వంద శాతం పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ పూర్తి..

చిలుకూరు hmtv: భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని ఆచార్యుల గూడెం గ్రామంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా వంద శాతం విజయవంతంగా పూర్తయింది.

కోదాడ డివిజన్‌లోనే ప్రథమ స్థానంలో నిలవడమే కాకుండా, రాష్ట్ర స్థాయిలో రెండో గ్రామంగా ఆచార్యుల గూడెం అరుదైన రికార్డు సృష్టించింది.

గత 25 రోజులుగా అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమించి ఈ ప్రక్రియను పూర్తి చేశారు. బూత్ నెంబర్ 105 పరిధిలో మొత్తం 1142 ఓట్లు ఉండగా, క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా మరణించిన వారు 28 మందిని, అదే గ్రామంలో డబల్ ఎంట్రీలు ఉన్నవారిని 2 చొప్పున గుర్తించి తొలగించారు. అలాగే, తాము వేరే గ్రామాల్లోనే నివాసం ఉంటున్నామని, అక్కడే ఓట్లు ఉంచుకుంటామని డిక్లరేషన్ ఇచ్చిన వారు 40 మందిగా తేల్చారు.

ప్రస్తుతం ఈ గ్రామంలో 1072 మంది ఓటర్లు అర్హులుగా తేలగా, మొత్తానికి మొత్తం వివరాలను ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అధికారులు ఆన్‌లైన్ చేశారు. ఈ సందర్భంగా కోదాడ డివిజన్‌లోనే మొదటి స్థానంలో నిలిపి, రాష్ట్ర స్థాయిలో ఆచార్యుల గూడెం గ్రామానికి పేరు తెచ్చిన ప్రతి ఒక్కరి శ్రమను ఎంఆర్ఓ ధ్రువ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ మేరకు శ్రమించిన బి.ఎల్.ఓ నెమ్మాది కృష్ణయ్యతో పాటు ఆర్ఐ మంత్రి పగడా సీతయ్య, కంప్యూటర్ టెక్నికల్ అసిస్టెంట్ హరి, సర్పంచ్ బొడ్డుపల్లి లక్ష్మీ బిక్షం, ఉపసర్పంచ్ నెమ్మాది వీరబాబు, గ్రామ కార్యదర్శి రాము, మరియు స్థానిక సహకార ప్రముఖులు అలవాల భాస్కర్, సోమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మైలార్శెట్టి సాయి, బొడ్డుపల్లి సైదులను ఎంఆర్ఓ ఘనంగా సన్మానించారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD

Next Story