Medchal: జవహర్‌నగర్ చట్టవ్యతిరేక చర్యలకు దూరంగా ఉండాలి

Medchal: డంపింగ్ యార్డు ఆందోళనపై ఏసీపీ చక్రపాణి హెచ్చరిక. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపాలి.

PURENDAR, ALWAL
Published on: 9 July 2026 9:27 PM IST
Medchal
X

Medchal: జవహర్‌నగర్ చట్టవ్యతిరేక చర్యలకు దూరంగా ఉండాలి

మేడ్చల్ జిల్లా: డంపింగ్ యార్డుకు సంబంధించి వాట్సాప్, సోషల్ మీడియాలో వాహనాలను అడ్డుకుంటామని, చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపడతామని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జవహర్‌నగర్ డివిజన్ ఏసీపీ చక్రపాణి విజ్ఞప్తి చేశారు.

ప్రజలు తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేయాలనుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా మాత్రమే నిర్వహించాలని సూచించారు. వాహనాల రాకపోకలను అడ్డుకోవడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడడం వంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.

చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శాంతిభద్రతలను పరిరక్షించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, శాంతియుత మార్గంలోనే తమ నిరసనలను నిర్వహించాలని ఏసీపీ చక్రపాణి కోరారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL

Next Story