Hyderabad: జూబ్లీహిల్స్‌లో ‘నవత సిల్క్’ షోరూంను ప్రారంభించిన శ్రీలీల!

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సంప్రదాయ వస్త్రకళకు ఆధునిక ఫ్యాషన్ హంగులు జోడిస్తూ ఏర్పాటు చేసిన నవత సిల్క్ షోరూంను సినీనటి శ్రీలీల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

RAJESH,	WEST ZONE
Published on: 27 Nov 2026 1:03 PM IST
Hyderabad
X

Hyderabad: జూబ్లీహిల్స్‌లో ‘నవత సిల్క్’ షోరూంను ప్రారంభించిన శ్రీలీల!

హైదరాబాద్: భారతీయ సంప్రదాయ వస్త్రకళకు ఆధునిక ఫ్యాషన్‌ హంగులు జోడిస్తూ జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన నవత సిల్క్‌ షోరూంను సినీనటి శ్రీలీల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చీరలు అందాన్ని రెట్టింపు చేస్తాయన్నారు. ఇక్కడి కలెక్షన్లు అన్ని వయసుల మహిళలను ఆకట్టుకునేలా ఉన్నాయన్నారు.

గీతా చౌదరి తుమ్మల ప్రత్యేక ఆలోచనలతో సంప్రదాయ చేనేత కళ, ఆధునిక డిజైన్ల సమ్మేళనంగా తీర్చిదిద్దారని తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ గీతా చౌదరి తుమ్మల మాట్లాడుతూ చీర భారతీయ సంస్కృతికి ప్రతీక అని. చేనేత కళకు ప్రాధాన్యమిస్తూ నాణ్యమైన వస్త్రాలను ఆధునిక డిజైన్లలో అందుబాటులోకి తేవాలన్నదే తమ ఉద్దేశమన్నారు.

ప్రతి మహిళ తన అభిరుచికి తగిన చీరను ఎంపిక చేసుకునేలా విస్తృత కలెక్షన్లను ఇక్కడ ఉంచినట్లు తెలిపారు. వినియోగదారుల ఇష్టాలకు అనుగుణంగా ఒకే చోట 10 వేలకుపైగా విభిన్న డిజైన్ల చీరలను అందుబాటులో ఉంచామన్నారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించారు. ప్రతి రూ.20 వేల విలువైన కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE