Hyderabad: ఉద్యమకారుల చావులపై హరీష్ రావు శవ రాజకీయం: అద్దంకి దయాకర్!

Hyderabad: తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్యపై హరీష్ రావు శవ రాజకీయం చేస్తున్నారని, బీజేపీ దేశాన్ని విడగొట్టే పనిలో ఉందని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు.

G. Rama Krishna, Hyderabad
Published on: 11 Nov 2026 5:19 PM IST
Hyderabad
X

Hyderabad: ఉద్యమకారుల చావులపై హరీష్ రావు శవ రాజకీయం: అద్దంకి దయాకర్!

హైదరాబాద్: జనగామ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్న రోజున బీఆర్ఎస్ నాయకులు ఎందుకు వెళ్లలేదు..? వారం తర్వాత హరీష్ రావు వెళ్లి రాజకీయం చేస్తున్నాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నేను నష్టపోయానని ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ తన లేఖలో పేర్కొన్నాడు. లేఖను వక్రీకరిస్తూ ప్రభుత్వం తీరు వల్లే చనిపోయాడని హరీష్ రావు మాట్లాడుతున్నాడు. వందల ఎకరాలు, ఫామ్‌హౌస్‌లు మీకు వస్తాయి.. ఉద్యమకారులు మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

మేం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఐదు లక్షల రూపాయల సాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించాం.. ఆయన భార్యకు ఉద్యోగం ఇప్పించడానికి ప్రయత్నం చేశాం. హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో రెచ్చగొట్టడం వల్లే 1,200 మంది చనిపోయారు. అధికారంలోకి వచ్చాక కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను పట్టించుకోలేదు. మా ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీని ఏర్పాటు చేసి వాళ్ల సమస్యలు తెలుసుకుంటోంది.

చనిపోయిన తర్వాత హరీష్ రావు లాంటి వాళ్లు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఉద్యమకారులను ఉపయోగించుకుని కేసీఆర్ కుటుంబం లాభపడింది. ఉద్యమకారులు నష్టపోయారు. వేముల లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్యను రాజకీయం చేయడం బీఆర్ఎస్ పార్టీ బుర్రలేని తనం. బుర్రలేని జనతా పార్టీ, ఎండిపోతున్న కూటమి ఇప్పుడు అధికారంలో ఉన్నాయి. భారత్ సమ్మిట్ దేశ వ్యతిరేక సమ్మిట్ అయితే కేంద్ర ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చింది..? మోదీ, అమిత్ షా తప్పు చేశారా..?

మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా వెళ్తానంటే కేంద్రం అడ్డుకుంది.. బీజేపీ జాతి వ్యతిరేక పార్టీ. అమెరికాలో ఉన్న పెద్ద కంపెనీలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కోసం ఎదురుచూశాయి. రేవంత్ రెడ్డి పేరు వస్తుందన్న భయంతో సీఎం అమెరికా పర్యటనను అడ్డుకున్నారు. దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన శ్యామ్ పిట్రోడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బీజేపీ మాత్రం దేశంలో విడగొట్టే విప్లవాన్ని తీసుకొచ్చింది.. మతం, కులం, ప్రాంతం, లింగ భేదాలు సృష్టిస్తోంది బీజేపీ. ప్రధాని మోదీని 'ది డివైడర్' అంటున్నారు.

దేశ ప్రజలను బీజేపీ అన్ని రకాలుగా మోసం చేస్తోంది. పాకిస్థాన్‌ను శత్రువు అని ప్రచారం చేసి, ఆ దేశ ప్రధాని మనవరాలి పుట్టినరోజుకు వెళ్లి పాయసం తిని వచ్చింది మోదీ. కనీసం ప్రెస్‌మీట్ పెట్టడం మోదీ, అమిత్ షాకు చేతకాదు. భారత్ సమ్మిట్‌కు హాజరయ్యే ప్రతినిధులు వివిధ వృత్తుల్లో పనిచేస్తున్నవారు. బీజేపీ జాతీయవాదం అంటే మనువాదమే.. కనీసం అది హిందుత్వవాదం కూడా కాదు. కులం, మతం, ప్రాంతం, లింగం, రంగు ఆధారంగా విడదీసేది బీజేపీ మాత్రమే.

ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించేది బీజేపీ. 'డివైడర్ జనతా పార్టీ' అని బీజేపీ పేరు మార్చుకోవాలి. బీజేపీతో కలిసిన పార్టీలన్నీ కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. ఇప్పుడు ప్రజలు బీజేపీని కాలగర్భంలో కలిపేయబోతున్నారు. కాలం కన్న నాయకుడు రాహుల్ గాంధీ.. బీజేపీని గద్దె దింపేది ఆయనే. చర్చకు రావాలని రాహుల్ గాంధీ అడిగితే బీజేపీ నేతలు మాట్లాడటం లేదు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని దద్దమ్మ ప్రధాని మోదీ.

బీజేపీ చిన్నపిల్ల బీఆర్ఎస్ రాష్ట్రంలో ఎల్‌నినోపై అడ్డగోలుగా మాట్లాడుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటే. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అంటున్నారు.. అయితే కరోనాను కేసీఆర్ తెచ్చాడా..? తెలంగాణకు కరువు సాయంపైn బీజేపీ ఎందుకు నోరు మెదపడం లేదు..? తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు మోదీ ఇంట్లో పెట్టుకోవడానికి ఉన్నాయా..? ప్రధాని మోదీ యాంటీ నేషనల్. రాహుల్ గాంధీని ప్రజలే నాయకునిగా చేస్తున్నారు.

రేవంత్ రెడ్డిని లక్ష్యంగా పెట్టుకుని అమిత్ షా వచ్చి హైదరాబాద్‌లో పాదయాత్ర చేశాడు. దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్.. కూల్చుతుంది బీజేపీ. అయోధ్య విరాళాలపై యూపీ సీఎం యోగి, ప్రధాని మోదీ నోరు మెదపడం లేదు. ప్రజా తిరుగుబాటు ఊపందుకుంటే బీజేపీ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. దేశంలో బీజేపీ సమయం ముగిసింది. బీజేపీకి మద్దతుగా మాట్లాడకపోతే దేశద్రోహులు అవుతారా..? ధిమాక్‌లెస్ పార్టీ బీజేపీ.

G. Rama Krishna, Hyderabad

G. Rama Krishna, Hyderabad