Chevella: చేవెళ్లలో ఘనంగా 'అధ్యాయ్ - 2026' వైద్య కళాశాల ఫెస్ట్ ప్రారంభం!

Chevella: చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్ వైద్య కళాశాలలో ఘనంగా ప్రారంభమైన 'అధ్యాయ్ - 2026' ఫెస్ట్.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 3 Nov 2026 1:17 PM IST
Chevella
X

Chevella: చేవెళ్లలో ఘనంగా 'అధ్యాయ్ - 2026' వైద్య కళాశాల ఫెస్ట్ ప్రారంభం!

Chevella: చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్ వైద్య కళాశాలలో ‘అధ్యాయ్ – 2026’ పేరుతో నిర్వహిస్తున్న కళాశాల ఫెస్ట్‌ను శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్, కళాశాల చైర్మన్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, విద్యావేత్త వరదా రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కళాశాల ఫెస్ట్‌కు సంబంధించిన బ్యానర్‌ను ఆవిష్కరించడంతో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలను ప్రారంభించారు. అనంతరం ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు వైద్య విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ, వైద్య వృత్తి కేవలం ఉపాధి మాత్రమే కాదని, సమాజానికి సేవ చేసే గొప్ప అవకాశమని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. వైద్య విద్యలో క్రమశిక్షణ, సేవాభావం, నైపుణ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ కళాశాల చైర్మన్, కళాశాల వైస్ చైర్మన్ వరదా రెడ్డి, డీన్ అండ్ ప్రిన్సిపల్ జోయా రాణి, సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ గౌరీ, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరరావు, సీనియర్ నాయకులు మాసన్నగారి మాణిక్ రెడ్డి, హెచ్‌ఆర్ విజయభాస్కర్ రెడ్డి, ఏజీఎం రవివర్మ, నగేష్, సీఓఓ అజీమ్, వినోద్ రెడ్డి, కిరణ్, అనీన్, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, వైద్యులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA