Hyderabad: అర్ధరాత్రి ఎన్‌కౌంటర్ ఉత్కంఠ.. హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు!

Hyderabad: హైదరాబాద్ ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధి బొంగుళూరు సాగర్ రహదారిపై మోస్ట్ వాంటెడ్ నిందితుడు శ్రీకాంత్‌పై పోలీసులు జరిపిన కాల్పుల ఘటన కలకలం రేపింది.

RAVI, IBRHAMIPATNAM
Published on: 1 July 2026 8:45 AM IST
Hyderabad
X

Hyderabad: అర్ధరాత్రి ఎన్‌కౌంటర్ ఉత్కంఠ.. హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు!

Hyderabad: ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బొంగుళూరు సాగర్ రహదారి పై పోలీస్ కాల్పులు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దోపిడీ, చోరీ కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పలు హెచ్చరిక అనంతరం కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. గాయపడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టగా, గతంలో ఆంధ్రప్రదేశ్ నర్సాపూర్ టౌన్ కానిస్టేబుల్ హత్య కేసులు A2గ ఉన్న నిందితుడు అని గుర్తించిన పోలీసులు.

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM

Next Story