Hyderabad: పేదల సన్నబియ్యం పక్కదారి.. రేషన్ మాఫియా గుట్టురట్టు!

Hyderabad: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టుబడింది.

RAVI, IBRHAMIPATNAM
Published on: 14 July 2026 11:52 AM IST
Hyderabad
X

Hyderabad: పేదల సన్నబియ్యం పక్కదారి.. రేషన్ మాఫియా గుట్టురట్టు!

Hyderabad: పక్క సమాచారంతో విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాత్రి 12 గంటల సమయంలో అధికారులు మూడు వాహనాలలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పెద్ద మొత్తంలో 1000 క్వింటాళ్లు రేషన్ బియ్యాన్ని పట్టుకున్న అధికారులు.

నాదర్గుల్ సమీపంలోని హార్డ్వేర్ పార్క్ లో గల మారుతి ఇండస్ట్రీస్ గోదాంలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం. గత కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న దందా. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదవారికి సన్న బియ్యం అందించాలని లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాన్ని కొంతమంది పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్లు

తెలంగాణ ప్రాంతం నుండి సన్నబియ్యని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠా. రాత్రి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టిన ఆదిభట్ల పోలీసులు.

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM

Next Story