Rajendranagar: వ్యవసాయ వర్సిటీలో ప్రొఫెసర్ దీక్ష.. కంచన్బాగ్ పీఎస్కు తరలింపు!
Rajendranagar: వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీని పదవి నుంచి తప్పించాలని కోరుతూ మహిళా ప్రొఫెసర్ తేజశ్రీ దీక్షకు దిగారు. పోలీసులు ఆమెను కంచన్బాగ్ పీఎస్కు తరలించారు.
Rajendranagar: వ్యవసాయ వర్సిటీలో ప్రొఫెసర్ దీక్ష.. కంచన్బాగ్ పీఎస్కు తరలింపు!
Rajendranagar: రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మహిళా ప్రొఫెసర్ తేజశ్రీ ఆమరణ నిరాహార దీక్ష. లైంగిక వేధింపుల కేసులో గత కొంతకాలంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులు బోధన, బోధనేతర సిబ్బంది.
విద్యార్థులు, ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో విచారణకు కమిటీ వేసిన ప్రభుత్వం. కమిటీ విచారణ నివేదిక వచ్చేంత వరకు విసి ని పదవి బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్న బాదిత మహిళా ప్రొఫెసర్.
ఉపకులపతిగా అధికారంలో ఉంటే కమిటీ చేపట్టే విచారణపై ప్రభావం చూపిస్తుందని ఆరోపణలు చేస్తున్న విశ్వవిద్యాలయం ఉద్యోగులు. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆల్దాస్ జానయ్య గారు ఇంకా వీసీ హోదాలో ఉంటూ తనకు ఇంకా అన్యాయమే చేస్తున్నారని బాదిత మహిళా ప్రొఫెసర్ ఈరోజు కాలేజీ లోని ధర్నా చౌక్ ప్రాంగణంలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంది.
రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని అదే విధంగా యూనివర్సిటీలో మహిళల భద్రతను కాపాడాలని కోరారు.
ఈ యూనివర్సిటీలో 70 శాతానికి పైగా మహిళలే ఉన్నారని వారందరూ కూడా వీసీ చేతిలో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారని వారందరినీ తను ఇంకా హోదాలో ఉండి భయభ్రాంతులకు గురి చేస్తూ మద్దతు తెలిపిన వారందరిపై కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.
ఇలాంటి ప్రజాస్వామిక దేశంలో మహిళలకు భద్రత మరియు న్యాయం జరగాలని... అలాగే తనకు న్యాయం జరిగేంతవరకు తను ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తూనే ఉంటానని ఈరోజు ధర్నా చౌక్ ప్రాంగణంలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది.
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మహిళా ప్రొఫెసర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మహిళా ప్రొఫెసర్ దీక్షను భగ్నం చేస్తూ దీక్షా శిబిరం నుండి నగరంలోని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు.




