LB Nagar: సమర్థవంతమైన నాయకుడిని డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి పీవీ మోహన్

LB Nagar: రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడి ఎన్నికపై ఎల్బీనగర్‌లో మధుయాష్కి గౌడ్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం. పాల్గొన్న ఏఐసీసీ పరిశీలకులు, ఎమ్మెల్సీ పీవీ మోహన్.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 31 Aug 2026 9:10 AM IST
LB Nagar
X

LB Nagar: సమర్థవంతమైన నాయకుడిని డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలి పీవీ మోహన్

LB Nagar: ఎల్బీనగర్ సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం- రంగారెడ్డి జిల్లా నూతన డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియలో భాగంగా తెలిపిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కర్మన్ఘాట్ లోని ఎన్ విలేజ్ కన్వెన్షన్ లో నిర్వహించడం జరిగింది.

ఏఐసీసీ పరిశీలకులు, కర్ణాటక ఎమ్మెల్సీ పీవీ మోహన్ గారు, ముఖ్యఅతిథిగా హాజరు కాగా.. జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి గారు, టిపిసిసి పరిశీలకులుగా టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి గారు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ పీవీ శ్రీనివాస్ గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చల్ల నరసింహారెడ్డి గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పీవీ మోహన్ గారు మాట్లాడుతూ... రంగారెడ్డి జిల్లా దేశంలోనే ఆర్థికంగా నెంబర్ వన్ జిల్లా అన్నారు. దేశంలోనే ఫర్ క్యాప్టా అధికంగా ఉందని వివరించారు. అలాంటి రంగారెడ్డి జిల్లాకు సమర్థవంతమైన నేతను డిసిసి అధ్యక్షులుగా ఎన్నుకోవాలన్నారు..ఓట్ చోరీ తోనే బిజెపి అధికారంలోకి వస్తుందన్నారు. మహారాష్ట్ర లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తర్వాత అనూహ్యంగా ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. ఎస్ఐఆర్ తో బిజెపి పొందుతుందని.. మన పార్టీ బిఎల్ఎ లు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయడం చాలా ముఖ్యమన్నారు. అందుకే బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ బలపడాలి అంటే సమర్ధవంతమైన డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే లక్ష్యంగా పనిచేసే నాయకుడికి అవకాశం ఇవ్వాలని సూచించారు.

మధుయాష్కి గారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పార్టీని కార్యకర్తలను మోసం చేసి, ఇతర పార్టీలోకి వెళ్ళినప్పటికీ.. మళ్లీ పార్టీని బలోపేతం చేయడంలో కార్యకర్తలు కృషి చేస్తున్నారన్నారు. ఎంపీగా రేవంత్ రెడ్డిని గెలిపించేందుకు ఎంతో శ్రమించారని వివరించారు. డీసీసీ అధ్యక్షుడు ఎన్నికలకు సంబంధించి కార్యకర్తలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించారు. తనకు రాజకీయ వారసులు ఎవరు లేరని, పార్టీ నాయకులు కార్యకర్తలే తన వారసులని పేర్కొన్నారు.

ఏఐసీసీ పరిశీలకులుగా వచ్చిన పీవీ మోహన్ గారు కేరళలో ఇన్చార్జిగా పనిచేసే ఆ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సమర్థవంతంగా పనిచేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ లో భాగంగా 1,87, 000 ఓట్లు నో మ్యాపింగ్ లో ఉన్నాయని నోటీసులు అందుకునేవారు సంబంధిత వివరాలు అందజేసేలా ప్రతి కార్యకర్త, బిఎల్ఎ లు పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు డిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన చల్లా నరసింహారెడ్డి గారిని అభినందించి సన్మానించారు.

డాక్టర్ మట్టా రాగమయి గారు, పటేల్ రమేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తూ, అందరినీ కలుపుకొని పోయి కష్టపడి పనిచేసే వారికి డీసీసీ అధ్యక్ష పదవికి ప్రతిపాదించాలని నాయకులకు సూచించారు. ఎవరైనా సరే పోటీలో ఉండొచ్చని పదవి రాకపోయినా నిరుత్సాహపడకుండా మరింత కష్టపడి పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారు తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story