Nagarkurnool: రాఘయి పల్లిలో ఐక్యత ఫౌండేషన్ ‘స్వచ్ఛ జలధార’ కార్యక్రమం!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా రాఘయి పల్లిలో ఐక్యత ఫౌండేషన్ "స్వచ్ఛ జలధార". జర్మన్ టెక్నాలజీతో మంచి నీటి ట్యాంకులను పరిశుభ్రం చేసిన ప్రతినిధులు.
Nagarkurnool: రాఘయి పల్లిలో ఐక్యత ఫౌండేషన్ ‘స్వచ్ఛ జలధార’ కార్యక్రమం!
Nagarkurnool: నాగర్ కర్నూల్ వెల్దండ మండలం, రాఘయి పల్లి గ్రామంలో త్రాగునీటి నిల్వ ట్యాంకుల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహణ.
ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో* చేపట్టిన “స్వచ్ఛ జలధార” కార్యక్రమం. రెండవ విడతలో భాగంగా సోమవారం వెల్దండ మండలం రాఘయి పల్లి గ్రామంలో త్రాగునీటి నిల్వ ట్యాంకులను పరిశుభ్రపరిచారు.
జర్మన్ సాంకేతికతతో కూడిన ప్రత్యేక యంత్రాల సహాయంతో ట్యాంకుల్లో పేరుకుపోయిన మురికి, వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో తొలగించి పరిశుభ్రపరిచారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, త్రాగునీటి నాణ్యతను మెరుగుపరచడానికి ఈ కార్యక్రమాన్ని కల్వకుర్తి నియోజకవర్గంలోని గ్రామాల్లో దశలవారీగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో రాఘయి పల్లి గ్రామ సర్పంచ్ సామ వెంకటయ్య , డిప్యూటీ సర్పంచ్ కొండల్ గ్రామ ఐక్యత ఫౌండేషన్ ప్రతినిధులు ,వార్డు సభ్యులు , యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




