Hyderabad: జనాభా లెక్కలు, SIR ప్రక్రియపై అఖిల భారత యాదవ మహాసభ పిలుపు!
Hyderabad: సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
Hyderabad: జనాభా లెక్కలు, SIR ప్రక్రియపై అఖిల భారత యాదవ మహాసభ పిలుపు!
హైదరాబాద్: ప్రతి గొల్ల(యాదవ్) కులస్తులు జనాభా లెక్కల తోపాటు ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో ఓటును తప్పకుండా నమోదు చేసుకోవాలని అఖిల భారత యాదవ మహాసభ యాదవ నాయకులు గొల్ల కులస్తులకు పిలుపునిచ్చారు.
సికింద్రాబాద్,ఓల్డ్ బోయినపల్లి లో అఖిల భారత యాదవ మహాసభ, తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు గొర్ల యశ్వంత్ యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి యాదవ కులస్తుల అభివృద్ధి కోసం పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
యాదవ సమాజం అభివృద్ధి చెందాలంటే యాదవులు అప్రమత్తంగా ఉండి తమ జనాభాను కనబర్చే విధంగా కృషి చేయాలని,అలా చేస్తేనే ప్రభుత్వాల నుండి మనకు రావాల్సిన ఫలాలు అందుతాయని యాదవ సంఘం నాయకులు యాదవ కులస్తులను కోరారు.
కురుమలు యాదవులు కాదు అంటున్నారు కనుక వారిని వదిలేయని,ప్రతి గొల్ల కులస్తులు పేరు చివరన యాదవ్ అనే ట్యాగ్ పెట్టుకుంటే యాదవ సమాజంకు మరింత గుర్తింపు వస్తుందని అఖిల భారత యాదవ మహాసభ యాదవ నాయకులు పేర్కొన్నారు.




