Mahabubabad: భూమి హక్కుల కోసం ఆలేరు రైతుల ఆందోళన

Mahabubabad: ఎంజాయిమెంట్ సర్వే ప్రకారం భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని ఆలేరు రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.

A RAJKUMAR, MAHABOOBABAD
Published on: 11 May 2026 5:31 PM IST
Mahabubabad
X

Mahabubabad

Mahabubabad: ఎంజాయిమెంట్ సర్వే ప్రకారం భూమి హక్కు పత్రాలు ఇవ్వాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్ ఎదుట ఆలేరు గ్రామ రైతులు ఆందోళన నిర్వహించారు. రైతులు అధికారులకు వ్యతిరేక నినాదాలు. ఈ సందర్భంగా బాధిత రైతులు రాజేశ్వరి, కందుల శ్రీను లు మాట్లాడుతూ, అధికారుల నిర్లక్ష్యంతో గ్రామ మొత్తాన్ని అడవి భూములలో చేర్చడంతో గ్రామానికి చెందిన రైతులకు పట్టాలు లేకపోవడంతో 50 ఎకరాలలో సాగు చేసే 20 మంది రైతులు రైతు బరోసా, రైతు భీమా, పీ.ఎం కిసాన్, బ్యాoకు రుణాలు సాగు చేసిన పంటలను మద్దతు ధరలకు విక్రయించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వందల ఏళ్లుగా సాగు చేసుకొని జీవనోపాధి పొందుతున్న పట్టా భూములను 2017 సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అటవీ భూములుగా పేర్కొంటూ పట్టాలు రద్దు చేసిందన్నారు.

2001 లో ఎంజాయ్ మెంట్ సర్వే చేసి సాగు భూమిగ తేల్చి కొంతమంది రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చారన్నారు. 20 మంది రైతులకు సంబంధించిన

50 ఎకరాలకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వకపోవడం తో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నామన్నారు.

రెవిన్యూ సర్వే అధికారులు బృందాలుగా గ్రామం లో తిరిగి క్షేత్ర స్థాయి లో ప్రతి రైతు వివరాలను నమోదు చేశారన్నారు. సర్వే నిర్వహించి ఏడాది గడుస్తున్నా పట్టాల పంపిణీ లో జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017 నుంచి 20 మంది రైతులు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు బ్యాంకు రుణాలు పొందులేక తీవ్ర బంధువులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులకు పట్టాలు అందించాలని లేకుంటే ఆత్మహత్యేలే శరణ్యమన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఆలేరు గ్రామ రైతులు పాల్గొన్నారు.

A RAJKUMAR, MAHABOOBABAD

A RAJKUMAR, MAHABOOBABAD

Next Story