Hyderabad: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శలు
Hyderabad: రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కమిషన్ అడుగుతున్నారని, రాష్ట్రంలో బ్రోకర్ల పాలన నడుస్తోందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు.
Hyderabad: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శలు
హైదరాబాద్: రిటైర్డ్ ఎంప్లాయ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి వద్దకు వెళ్లితే పది శాతం కమిషన్ ఇస్తేనే ఇస్తామనడం బాధాకరం. దీనికి భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలి
అధికారులు చట్టం మరిచిపోయారా.. మంత్రులు ఇచ్చే ఆదేశాలనే అమలు చేస్తున్నారా? ఈ ప్రభుత్వం ఎంతో కాలం మనుగడ సాధించదు. హైడ్రా కమిషనర్ మీద రోజుకో కేసు. ఆర్నెల్లు, ఏడాదిలోపు ఈ ప్రభుత్వం మారుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 4లక్షల కోట్ల అప్పు తెచ్చింది.
జీఎస్డీపిలో 50 శాతంపైగా అప్పు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. మూసీ పేరు మీద పది వేల కోట్లు ఖర్చు చేయాలని చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే గ్రామ పంచాయతీ, మున్సిపాల్టీలకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మెగా శ్రీనివాస్ రెడ్డికి పది శాతం కమిషన్ ఇస్తే బిల్లులు క్లియర్ చేస్తున్నారంటా ఎక్కడిక్కడా బ్రోకర్లు పెట్టుకుని పది శాతం కమిషన్ తీసుకుని బిల్లులు క్లియర్ చేస్తున్నారు.
న్యూ సిటీ కాదు ఉన్న సీటీని బాగు చేయండి. 12 నుంచి 15వేల కోట్లు ఆర్టీసీ బకాయి పడ్డది కొడంగల్ లో లిప్ట్, మూసీ అంటూ రేవంత్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం డిప్యూటేషన్ సీఎంగా.. లూటీ సీఎంగా మారిపోయారు. నైనీ బ్లాక్ సీఎం మనుషులకు ఇవాళా.. డిప్యూటీ సీఎం మనుషులకు ఇవ్వాలా అనే దోబూచులాటలో క్యాన్సల్ అయ్యే పరిస్థితి వచ్చింది.
పదేళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెబుతున్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఎన్నికలు పెడితే పది సీట్లు రావు అనే సంగతి తెలియదా? ఓడిపోతామనే భయంతోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టడం లేదు. జస్టిస్ రాజశేఖర్ రెడ్డి వస్తున్న ఆరోపణలను సుమోటోగా స్వీకరించాలి.




