Hyderabad: హైదరాబాద్ ఫోర్టిస్ ఆసుపత్రిపై రోబోటిక్ సర్జరీ మోసపు ఆరోపణలు!
Hyderabad: లక్డీకాపూల్ ఫోర్టిస్ ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీ పేరిట మోసం చేస్తున్నారంటూ దళిత విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు వంశీ బాలెంల తీవ్ర ఆరోపణలు.
Hyderabad: హైదరాబాద్ ఫోర్టిస్ ఆసుపత్రిపై రోబోటిక్ సర్జరీ మోసపు ఆరోపణలు!
Hyderabad: లక్డీకాపూల్ ఫోర్టిస్ ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీ సదుపాయం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని దళిత విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు వంశీ బాలెంల ఆరోపించారు. ఆసుపత్రిలో రోబోటిక్ మెషిన్ లేదని యాజమాన్యం చెప్పినప్పటికీ, తనిఖీల సమయంలో మరో ఆసుపత్రికి చెందిన రోబోటిక్ మిషన్‌ను తీసుకొచ్చి చూపించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఆసుపత్రి, సంబంధిత వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌ను డిమాండ్ చేశారు.




