Nizampet: డంపింగ్ యార్డ్ టు జవహరనగర్.. అక్రమాలపై విచారణకు డిమాండ్

Nizampet: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో చెత్త రవాణా బిల్లులు, కాంట్రాక్టుల్లో సుమారు రూ. 3.40 కోట్ల అక్రమాలు జరిగినట్లు సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ ఫిర్యాదు చేశారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 13 Jun 2026 8:30 AM IST
Nizampet
X

Nizampet: డంపింగ్ యార్డ్ టు జవహరనగర్.. అక్రమాలపై విచారణకు డిమాండ్

Nizampet: నిజాంపేట్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో డంపింగ్ యార్డ్ నుంచి జవహరనగర్ కు చెత్త రవాణా కాంట్రాక్టులు, బిల్లుల చెల్లింపులు, నకిలీ పత్రాల సృష్టి, ప్రజాధన దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ సీఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 నుంచి 25 వరకు చెత్త రవాణా కాంట్రాక్టులకు సంబంధించి సుమారు రూ.3.40 కోట్ల చెల్లింపుల్లో అక్రమాలు జరిగి ఉండవచ్చునన్నారు. ఇందుకు సంబంధించిన కాంట్రాక్టులు, బిల్లుల చెల్లింపులపై విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ఈ వ్యవహారంలో అప్పటి ఉన్నతాధికారుల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరపాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story