Patancheru: పటాన్‌చెరు–ఆదిలాబాద్ రైల్వే లైన్‌కు ఆమోదం తెలపండి!
Patancheru: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పటాన్‌చెరు-ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి.
Patancheru: పటాన్‌చెరు–ఆదిలాబాద్ రైల్వే లైన్‌కు ఆమోదం తెలపండి!
Patancheru: పటాన్‌చెరు(నాగలపల్లి)–ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి ఆమోదం తెలపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి లేఖ అందజేసిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే రైల్వే బోర్డుకు సమర్పించబడిందని లేఖలో పేర్కొన్న ఏలేటి
ఫైనల్ లొకేషన్ సర్వే కూడా పూర్తైందని లేఖలో వివరణ
మొత్తం 136.503 కిలోమీటర్ల ఈ రైల్వే మార్గం నిర్మల్, ఆర్మూర్, ఆదిలాబాద్ ప్రాంతాలకు ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ మార్గంతో నిజామాబాద్, ఆదిలాబాద్ మార్కెట్ యార్డులకు వ్యాపారుల రాకపోకలు సులభమవుతాయి
హైదరాబాద్, నాందేడ్, కరీంనగర్ ప్రాంతాలకు విద్యార్థుల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుందని పేర్కొన్నారు.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిర్మల్ బొమ్మలు, కళాఖండాలకు కొత్త మార్కెట్లు లభించే అవకాశం ఉంటుందని అన్నారు.
వ్యవసాయానికి ప్రసిద్ధి చెందిన అంకాపూర్ గ్రామంతో పాటు ఆర్మూర్ ప్రాంతానికి కూడా రైల్వే అనుసంధానం కలుగుతుందని తెలిపారు.
ఈ రైల్వే కారిడార్ వల్ల పశ్చిమ తీర ప్రాంతాల నుంచి ఈశాన్య భారతానికి తక్కువ దూరంలో రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
ఈ ప్రాజెక్టును త్వరగా ఆమోదించి రైల్వే పింక్ బుక్‌లో చేర్చాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి.




