Alwal: ఆల్వాల్ కాలనీల్లో కాంగ్రెస్ నేత పర్యటన!
Alwal: ఆల్వాల్ చంద్రపురి కాలనీ పరిధిలోని శాంతినగర్, వెంకటేశ్వర కాలనీల్లో కాంగ్రెస్ నేత శ్రీకాంత్ యాదవ్ పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు.
Alwal: ఆల్వాల్ కాలనీల్లో కాంగ్రెస్ నేత పర్యటన!
Alwal: చంద్రపురి కాలనీ డివిజన్-02 పరిధిలోని శాంతినగర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీల్లో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, కాలనీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి కృష్ణ (మిట్టు), శ్రీనివాస్, బాలు ముదిరాజ్, శోభారాణి, సురేష్, రమేష్, గిరిరాజు, రవి, భానుతో పాటు పలువురు పాల్గొన్నారు.




