secunderabad: రెండు పడక గదుల ఇళ్ల పేరిట భారీ మోసం.. ముగ్గురు అరెస్ట్!
secunderabad: అల్వాల్ పీఎస్ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ 99 మందిని మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
secunderabad: రెండు పడక గదుల ఇళ్ల పేరిట భారీ మోసం.. ముగ్గురు అరెస్ట్!
సికింద్రాబాద్: అల్వాల్ పీఎస్ పరిధిలో రెండు పడక గదుల ఇళ్లను ఇప్పిస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు పుష్పలత,విశాల్, మహేందర్ సింగ్ లను అరెస్టు చేశాము..మరో నలుగురి కోసం గాలిస్తున్నాము
అల్వాల్ లో ఉండే జయరాజ్ ప్రభుత్వ కార్యాలయాలలో పైరవీలు చేస్తూ ఉంటాడు పుష్పలత గతంలో జి.హెచ్.ఎం.సి లో విధులు నిర్వహించేవారు. జయరాజ్,పుష్పలత కలిసి ప్రజలకు రెండు పడక గదుల ఇళ్ళు ఇస్తామని నమ్మించారు
అదే అదునుగా తీసుకుని అల్వాల్ పరిధిలో పరిచయమున్న వ్యక్తులకు లక్ష రూపాయలకే ఇళ్లు ఇస్తామని నమ్మించారు. దాదాపు 2023 నుండి 99 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
పలు దఫాలుగా వీరి నుండి డబ్బులు వసూలు చేసినట్లు పేర్కొన్న పోలీసులు. ప్రభుత్వ కార్యాలయాల్లో సంప్రదించగా వీరికి రెండు పడక గదుల ఇళ్ళు కేటాయించలేదని తేలడంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో పారదర్శకత ఉంటుంది కాబట్టి ప్రజలు దళారులను నమ్మి మోసపోవద్దు




