Amanagallu: ఆమనగల్ ప్రభుత్వ డిస్పెన్సరీలో ఘనంగా 11వ ఆయుర్వేద దినోత్సవం!
Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ ప్రభుత్వ హోమియో డిస్పెన్సరీలో ఘనంగా 11వ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు. హాజరైన కౌన్సిలర్ మహేష్, వైద్యులు.
Amanagallu: ఆమనగల్ ప్రభుత్వ డిస్పెన్సరీలో ఘనంగా 11వ ఆయుర్వేద దినోత్సవం!
Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమనగల్ ప్రభుత్వ హోమియో డిస్పెన్సరీలో బుధవారం ఆయుర్వేద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డా. శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ మహేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయుర్వేదం ద్వారా ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం ఆయుర్వేద వైద్య విధానాన్ని మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంగళపల్లి ఉపసర్పంచ్ శ్రీను, సీహెచ్‌సీ వైద్యులు డా. ఊర్మిళ, డా. స్వాతి, ఫార్మసిస్టులు సత్యమ్మ, ఇందిర, హెచ్‌ఈఓ తిరుపతిరెడ్డి, ఉమాపతి, లక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ వేణుతో పాటు శ్రీను, గుజ్జరి శ్రీను, నరేష్, గోపాల్‌రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.




