Amanagallu: ఆమనగల్లో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు!
Amanagallu: ఆమనగల్ మున్సిపాలిటీ నుచ్చుగుట్ట తండాలో ఘనంగా బోనాల పండుగ. బంగారు మైసమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ చైర్మన్ ఫత్యనాయక్.
Amanagallu: ఆమనగల్లో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు!
ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలో 3 వార్డు నుచ్చుగుట్ట తండాలో అంగరంగ వైభవంగా బోనాలు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మున్సిపాలిటీ చైర్మన్ ప త్యనాయక్ పాల్గొని కల్కి భగవాన్ స్వామితో కలిసి బంగారు మైసమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలు పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో , సుఖశాంతులతో సుభిక్షంగా ఉండేలా చూడాలని అమ్మవారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చందు నాయక్, సురేష్ నాయక్, కుమార్ ధోని గౌడ్, శివ, విజేందర్ నాయక్, Ex ఆర్మీ రవీందర్ నాయక్,నరేందర్, సంతోష్, సందీప్,ఈశ్వర్,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




